సరి కొత్త ఫీచర్ లను ప్రవేశపెట్టిన PHONE PE
- మొబైల్ డేటా , వైఫై (wifi) లేకుండానే పేమెంట్స్!
- మొబైల్ డేటా , వైఫై (wifi) లేకుండానే పేమెంట్స్!
హైదరాబాద్,ఆగస్టు31(రాజధాని న్యూస్) : ఇంటర్నెట్ సదుపాయం ( మొబైల్ డేటా , వైఫై - wif i) లేకున్నప్పటికీ యూపీఐ పేమెంట్ చేసేలా PHONE PE సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. దేశంలో స్మార్ట్ ఫోన్ లు , ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేని గ్రామీణ ప్రాంతాలలో సైతం డిజిటల్ చెల్లింపులను తీసుకెళ్లేందుకు PHONE PE - 123పే' సేవలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్లకు పైగా ఉన్న వినియోగదారులకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే నేరుగా యూపీఐ చెల్లింపులు చేసుకునే వెసులుబాటును ఈ సేవలు కల్పిస్తాయి.

- కొత్త ఫోన్లలో App ప్రీ ఇన్స్టాల్ :
- Nokia, HMD, Lava, Itel తో PHONE PE టై అప్ అయింది. ఈ మోడల్ కు చెందిన కొత్త ఫోన్లలో App ప్రీ ఇన్స్టాల్ అయి రానుంది. ఈ సరికొత్త యాప్ లో బ్యాంక్ సెలక్ట్ చేసుకొని, డెబిట్ కార్డు చివరి 6 డిజిట్స్ ఎంటర్ చేసి UPI పిన్ సెట్ చేసుకోవాలి. ఇది ఇంగ్లిష్తో పాటు 12భారత భాషల్లో అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు.
కామెంట్లు