సెలవు రోజున కూడా కొనసాగిన నిరసన
- సమస్యల పరిష్కారినికై 28వ రోజు కొనసాగిన నిరసన - తెలంగాణ ఆయుష్ వైద్యుల శాంతియుత నిరసన
- సమస్యల పరిష్కారినికై 28వ రోజు కొనసాగిన నిరసన - తెలంగాణ ఆయుష్ వైద్యుల శాంతియుత నిరసన
ఎర్రగడ్డ,ఆగస్టు30(రాజధాని న్యూస్) : ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్ విద్యార్థులు, హౌస్ సర్జన్లు మరియు పీజీ డాక్టర్ లు తమ తమ ఆసుపత్రులు, కళాశాలల వద్ద 28వ రోజు కూడా శాంతియుత నిరసనను కొనసాగించారు.
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ న్యాయమైన డిమాండ్ విషయంలో తమను మరింత అయోమయంలో పడవేయవద్దని మీడియా ముఖంగా విద్యార్థులు ప్రభుత్వానికి వినమ్రంగా, స్పష్టంగా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోంది? ఎందుకు ఆయుష్ వైద్యుల విషయంలో ఇంకా నిర్లక్ష్యం కొనసాగుతోంది? ... అంటూ విద్యార్థులు మరోసారి ప్రశ్నించారు. తమ ప్రధాన డిమాండ్ అయిన అల్లోపతి తో సమానమైన స్టైపెండ్కు సంబంధించిన జిఓ ను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఇదిలా ఉండగా, పలువురు ఆయుష్ హౌస్ సర్జన్లు మరియు పీజీ డాక్టర్లు రిలే నిరాహార దీక్షలో పాల్గొని, తమ పోరాటాన్ని కొనసాగించారు.
“మమ్మల్ని అయోమయంలో ఉంచవద్దు, ఇక ఆలస్యం చేయవద్దు, హామీలు కాదు — స్పష్టమైన జిఓ కావాలి, 28 రోజులుగా శాంతియుత పోరాటం కొనసాగుతోంది. ఆయుష్ కు న్యాయం చేయాలి. అల్లోపతి తో సమానమైన స్టైపెండ్పై జీవో వెంటనే విడుదల చేయాలంటూ స్పష్టత కోరారు.
కామెంట్లు