అత్యంత వైభవంగా దర్శనమిచ్చిన బల్కం పేట్ ఎల్లమ్మ
అమీర్ పేట్, ఆగస్టు28(రాజధాని న్యూస్) : రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పునస్కరించుకొని రత్నాలతో పొదిగిన బంగారు చీర అలంకరణలో అత్యంత వైభవంగా దర్శనమిచ్చిన బల్కం పేట్ ఎల్లమ్మ అమ్మవారు. వివిధ రకాల రాఖీల అలంకరణలో కూడా దర్శనమిచ్చిన అమ్మవారు. ఆలయ అర్చకులు అనిల్ స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
కామెంట్లు